ఒడిశా నూతన గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణం
భువనేశ్వర్ (CLiC2NEWS): ఒడిశా నూతన గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర 27వ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఎం మోహన్ చరణ్ మాఝి, మాజి సిఎం నవీన్ పట్నాయక్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.