కమ్మని పిలుపు

మాటలు వడిసి మూటగట్టుకొనే నీ ప్రయత్నంలో

తొలి పిలుపు ‘‘తాతా,తాతా తాతా’’ అని

తన్మయత్నంలో నా మనస్సు

పులికరింతతో పరమానందం

మాటలకందని మధురానుభూతి

మదికి సోకిన పలుకుల పారవశ్యం

మళ్లీ,మళ్లీ వినాలనే తహతహ,నా యెదలో

మీ బాధ నేనెరుగుదునని

సాయం చేసింది సెల్‌ఫోన్‌

కమ్మని ఆ మాటల రికార్డు, రివైండిరగ్‌

ఆనంద డోలికలో తేలియాడుతూ

ఊగిపోతూ అలాఅలా తేలిపోతున్న నా

హృదయ ప్రకంపనలు నీకు వినిపించలేక…

తప్పడం లేదు ఇంకా ఎదురుచూపులు

మన దూరం ఇంకా కరగలేదు కానీ..

కరోనా ఆంక్షలు ఇక కొద్ది రోజులే

బైడన్‌ ఆంక్షలకు బంధ విముక్తి.

ఎనిమిది నెలల ప్రాయపు లేత ప్రాయం

పడిలేస్తూ, తడబడుతూ, నిలబడేందుకు

ప్రయత్నాలతో అక్కడ నీవు, అన్నీ ప్రత్యక్షంగా

వీక్షించాలనే తపనతో నేనిక్కడ

అతి త్వరగా నీ చెంతవాలనే ఆవేధన

సాకారం అవుతుందో లేదో

సమస్యలు ఏవేవి ముందుకు వస్తాయో ఏమో

అయినా, అధిగమించి, నీ చెంత చేరాలని

అక్కున చేర్చుకోవాలని,అంతా నేనై నడిపించాలని

ఆరాటపడుతున్నది మనస్సు

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు

Gmail: rangaiahkoneti@gmail.com

 


త‌ప్ప‌క చ‌ద‌వండి:   

అప్పులు+అమ్మకాలు =పరిపాలన

తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ

నిరీక్షణ

శ్రావణ లక్ష్మికి స్వాగతం

కంప్యూటర్ కాపురాలు

అవసరం

మగ సమాజం

అహం అదే ఇగో   
విమాన యానం     
రాజకీయ జలకాలా`టలా`
కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..
కోనేటి రంగయ్య: మనసు ఆరాటం
Leave A Reply

Your email address will not be published.