Amazon Prime: రేపు ఓటిటిలోకి ‘కంగువా’..
Amazon: డిసెంబర్ 8న కంగువా చిత్రం ఒటిటిలోకి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ఫ్రైమ్ వీడియో ఎక్స్ వేదికగా పోస్టర్ను పంచుకుంది. శివ దర్శకత్వంలో హీరో సూర్య నటించిన చిత్రం కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాబిడివోల్ విలన్ గా నటించారు. దిశా పటాని హీరోయిన్. ఫాంటసీ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటిటిలోకి రానుంది. తెలుగు ,కన్నడ, తమిళం మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.