బిజెపికి క‌న్నా గుడ్‌బై

గుంటూరు (CLiC2NEWS): మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ భార‌తీయ జ‌న‌తాపార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేర‌కు గురువారం గుంటూరులో త‌న అనుచ‌ర‌ల‌తో స‌మావేశ‌మైన అనంత‌రం రాజీనామాను ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా పార్టీని వీడుతున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి న‌డ్డాకు పంపిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా త‌న వ్య‌క్తి గ‌త కారణాల వ‌ల్ల‌నే పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు లేఖ‌లో ఆయ‌న పేర్కొన్నారు.
కాగా గ‌త కొంత‌కాలంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వంపై ఆయ‌న అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.