ఎపి సిఎం చంద్రబాబుతో కపిల్‌దేవ్ భేటీ..

అమరావతి (CLiC2NEWS): భారత క్రికెట్ మాజి కెప్టెన్ కపిల్‌దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఉండవల్లిలో ఎసిఎ అధ్యక్షుడు , విజయవాడెంపి కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో గోల్ఫోకోర్స్ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. కపిల్‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షడుగా ఉన్నానని, గోల్ప్ గురించి సిఎంతో మాట్లాడినట్లు తెలిపారు. ఆయన చాలా ఆసక్తిగా ఉన్నరని తెలిపారు. స్పోర్ట్స్ సిటి ఇస్తే చాలా సంతోషిస్తానన్నారు.
అనంతరం కేశినేని మాట్లాడుతూ.. విశాఖ, అమరావతిలో గోల్ఫ్‌కోర్సులు పెడతామని, ఎపి అంబాసిడర్‌గా కపిల్‌దేవ్ ఉండాలని కోరినట్లు తెలిపారు. ఎపి క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను వెలికితీస్తామని ఆయన తెలిపారు.