Karnatak: రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్
ఢిల్లీ, మహారాష్ట్రలో పరిస్థితి దారుణమన్న సిఎం

బెంగళూరు(CLiC2NEWS): దేశంలో కరోనా వైరస్ అతకంతకూ విజృంభిస్తున్న వేళ దేశం మరోసారి కఠిన ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర సమా పలు రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్ అమలు పరుస్తుండగా.. తాజాగా కర్ణటాక ప్రభుత్వం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది.
మంగళవారం రాత్రి నుంచి కర్ణాటకలో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు సిఎం యడియూరప్ప వెల్లడించారు. సోమవారం కేబినెట్ సమావేశం అనంతరం సిఎం యెడియూరప్ప మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యప్తంగా వైరస్ విజృంభిస్తోందన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ కంటే పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వ్యక్సిన్ అందిస్తామని వెల్లడించారు. 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం ఉచితంగానే టీకా వేస్తుందన్నారు. మంగళవారం నుంచి 14 రోజులపాటు రాష్ట్రవ్యప్తంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. 10 గంటల తర్వాత షాపులు మూసివేయబడి ఉంటాయని అన్నారు.
ఈ రెండు వారాలపాటు ప్రజారవాణా సైతం నిలిచిపోనుంది. లాక్ డౌన్ రోజుల్లో వ్యవసాయ రంగాలు, నిర్మాణ రంగాలు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో యడియూరప్ప ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.