సిఎం సిద్దరామయ్యకు రూ. 10వేలు జరిమానా: హైకోర్టు

బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటక ముఖ్యమంత్రి సిదద్రామయ్యకు రాష్ట్ర హైకోర్టు జరిమానా విధించింది. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ 2022లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆ కేసును కొట్టివేస్తూ.. రోడ్లను దిగ్భంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు సిఎంకు రూ.10వేల జరిమానా విధించింది. ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాతో పాటు మంత్రులు ఎంబి పాటిల్, రామలింగారెడ్డి కూడా ఉన్నారు.
గతంలో సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో సిఎం రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అప్పటి సిఎం బసవరాజ్ బొమ్మై నివాసాన్ని చుట్టిముట్టి.. సిద్దరామయ్య, సీనియర్ నేతలు మార్చ్ చేపట్టారు. ఆ సమయంలో రోడ్లను దిగ్భంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును కొట్టి వేయాలని సిఎం సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేసి.. ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది