ఉద్వేగానికి గురైన డికె
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/DK-SHIVAKUMAR.jpg)
బెంగళూరు (CLiC2NEWS): కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డి కె శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పార్టీ ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తానని సోనియా గాంధీకి మాటిచ్చానని డికె తెలిపారు. కన్నడ నాట కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చుతానని సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేకు మాట ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశౄరు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి సోనియా గాంధీ వచ్చారు.. అది నేను ఎప్పుడూ మర్చిపోలేను అని డికె భావోద్వేగానికి గురయ్యారు.