జూనియ‌ర్ ఎన్‌టిఆర్‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ఆహ్వానం..

బెంగ‌ళూరు (CLiC2NEWS): సినీ హీరో జూనియ‌ర్ ఎన్‌టిఆర్‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆహ్వానం పంపింది. వ‌చ్చేనెల ఒక‌టో తేదీన నిర్వ‌హించ‌బోయే రాజ్యోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఎన్‌టిఆర్ హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్‌కు క‌ర్ణాట‌క రాష్ట్ర అత్యుత్త‌మ పుర‌స్కార‌మైన క‌ర్ణాట‌క ర‌త్న అవార్డు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి జూనియ‌ర్ ఎన్‌టిఆర్‌ను ఆహ్మానించిన‌ట్టు తెలుస్తోంది. ఎన్‌టిఆర్‌తో పాటు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.