HMPV Virus: క‌ర్ణాట‌క స‌ర్కార్ అడ్వైజ‌రీ

బెంగ‌ళూరు (CLiC2NEWS): క‌ర్ణాట‌క రాష్ట్రంలో హెచ్ ఎంపివి వైర‌స్ వెలుగు చూడ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మాస్కులు ధ‌రించాల‌ని సూచించింది. రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో ఇద్ద‌రు చిన్నారులకు హెచ్ ఎంపివి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. వారిలో ఒక‌రు కోలుకొని ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జ్ కాగా.. రెండ‌వ చిన్నారి చికిత్స పొందుతుంది. ఈ నేప‌థ్యంలో  ప్ర‌భుత్వం అడ్వైజ‌రీని విడుద‌ల చేసింది. ఈ వైర‌స్ కొవిడ్‌లా వ్యాప్తి చెందేది కాద‌ని.. అందువ‌ల్ల ప్ర‌జ‌లెవ్వ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఈ వైర‌స్ పిల్ల‌లు, వృద్ధుల‌పై ప్ర‌భావం చూపుతుందని, వారిలో సాధార‌ణంగా జ‌లుబు వంటి ఇన్ఫెక్ష‌న్లు కార‌ణ‌మ‌వుతుందని డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అడ్వైజరీ లో పేర్కొంది.

హెచ్ ఎంపివి వైర‌స్ సోకితే ద‌గ్గు, జ్వ‌రం, ముక్కు దిబ్బ‌డ‌, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌లుగుతుంది. వ్యాధి తీవ్ర‌త ఎక్కువైతే కొంద‌రిలో బ్రాంకైటిస్ , నిమోనియాకు దారితీయోచ్చ‌ని డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (డిఎంఇ) తెలిపింది. హెచ్ ఎంపివి వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా క‌ట్టడి చేసేందుకు డిఎమ్ఇ ప‌లు సూచ‌న‌లు చేసింది. ర‌ద్దీ ఉన్న ప్ర‌దేశాల్లో త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాలి. త‌ర‌చూ స‌బ్బుతో చేతుల‌ను శుభ్రం చేసుకోవాలి. వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే బ‌హిరంగ ప్ర‌దేశ‌ల‌కు దూరంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఒక‌రు వాడిన రుమాలు, తువ్వాలును షేర్ చేసుకోవ‌ద్ద‌ని.. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉమ్మి వేయెద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

Leave A Reply

Your email address will not be published.