కార్తిక సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
హైదరాబాద్ (CLiC2NEWS): కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో తెలంగాణలోని ప్రధాన ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు ముక్కంటిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తిక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి దర్శనానికి ఇవాల తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. వరంగల్ జిల్లాలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు, నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.