కార్తీక సోమవారం.. శోభాయమానంగా ఆలయాలు

హైదరాబాద్ (CLiC2NEWS): కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా, సందడిగా మారాయి. వేకువజామునుండే భక్తులు దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలంలోని ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఆలయంలోని కంపార్ట్‌మెంట్‌లు, క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆధికారులు తగు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, అల్పాహార ప్రసాదాలను పంపిణీ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీపాలు వెలిగించి, స్వామివారి దర్శనం చేసుకున్నారు.
