తెలంగాణలో టిడిపికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలి
తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎన్ టిఆర్ భవన్‌లో గురువారం తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం వచ్చేలా చేయాలని కార్యకర్తలను కోరారు. తెలుగుజాతి అభివృద్ధికి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ టిఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ జన్మించిందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టిడిపి ఉంటుందిని చంద్రబాబు స్పష్టం చేశారు. పాలనను పేదవాడి ఇంటిముందుకు తీసుకొచ్చి.. రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన నాయకుడు ఎన్‌టి ఆర్ అని అన్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పార్టీలో చేరానని.. ఆయన ఆశీస్సులతో ప్రమాణం చేశానన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. టిడిపికి తెలంగాణలో పూర్వ వైభవం రావడానికి గ్రామగ్రామాన తిరిగి కృషి చేద్దామని అన్నారు.