తెలంగాణ టిడిపికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా..!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యాత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉంటున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయం కాసాని జ్ఞానేశ్వర్కి వివరించారు. ఈ నేపథ్యంలో టిటిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఆదివారం ఎన్టిఆర్ భవన్లో కాసాని పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్టానం నిరాకరించినట్లు శ్రేణులకు తెలిపారు. దీనిపై కొందరు నేతలు స్పందిస్తూ.. పోటీ చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాసాని భావోద్వేగానికిగురయ్యారు. అనంతరం టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.