రెండు కాళ్లు, చేయి లేకున్నా.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కౌశిక్!

పనాజి (CLiC2NEWS): అతని పేరు టింకేశ్ కౌశిక్.. తొమ్మిదేళ్ల వయస్సులో కరెంట్ షాక్ గురై రెండు కాళ్లు, ఓ చేయి కోల్పోయాడు. మూడు అవయువాలు 90 శాతం కోల్పోయి.. ముప్పై ఏళ్ల వయస్సులో ఎన్నో సవాళ్లను అధిగమించి ఎవరెస్ట్ శిఖరాన విజయ సంకేతం చూపించి ప్రపంచ రికార్డు సృష్టించారు.
తన ఆశయానికి అంగవైకల్యం అడ్డుకాదని భావించిన కౌశిక్.. ఎలాగైనా ఎవరెస్టును అధిరోహించాలని ఆశయంగా పెట్టుకున్నాడు. దీనికోసం తీవ్రంగా శ్రమించి.. మే 4వ తేదీన నేపాల్ నుండి సాహసయాత్రను ప్రారంభించాడు. మే 11 న బేస్ క్యాంపుపై జాతీయ జెండా ఎగురవేశాడు.
90శాంతం అంగవైకల్యంతో ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తిగా కౌశిక్ రికార్డు సృష్టించారు. అతను గోవాలో ఫిట్‌నెస్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. దివ్యాంగులకు ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన కౌశిక్ పై గోవా సిఎం ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. రాష్ట్రం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ విజయం యువతకెంతో స్ఫూర్తి దాయకమని, ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలిని ఆకాంక్షించారు.