TS: ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరు ఖరారు
హైదరాబాద్ (CLiC2NEWS): గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును తెలంగాణ కేబినెట్ ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ఆమోదానికి రాష్ట్ర గవర్నర్‌కు కేబినెట్ పంపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే టిఆర్ ఎస్‌లో చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన ముఖ్యమంత్రి సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరిన సంర్భంలో కౌశిక్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని సిఎం చెప్పారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి సీఎం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.