కారెక్కిన పాడి కౌశిక్​ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్​ ప్రగతి భవన్​లో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి కెసిఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. హుజూరాబాద్​కు పలువురు కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.

కౌశిక్ రెడ్డికి పార్టీ కండువా క‌ప్పి సిఎం కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని కౌశిక్​ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది.

కాంగ్రెస్​కు రాజీనామాఈ ఫోన్​ సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారటంతో కాంగ్రెస్​ కౌశిక్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ఇవాళ కెసిఆర్ సమక్షంలో టిఆర్ ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. “రాష్ట్ర అభివృద్ధికి దోహ‌ద‌ప‌డాల‌ని కౌశిక్‌రెడ్డి టిఆర్ ఎస్ లోకి వ‌చ్చారు. యువ‌నేత కౌశిక్‌రెడ్డిని ఆయ‌న అనుచ‌రుల‌ను సార‌ద‌రంగా టిఆర్ ఎస్ లోకి ఆహ్వానిస్తున్నాను. కాశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి నాతో క‌లిసి ప‌నిచేశారు. నాడు చెన్నారెడ్డి ఉద్య‌మాన్ని ప‌తాక‌స్థాయికి తీసుకువెళ్లారు. తెలంగాణ ప్ర‌జా స‌మితి అప్ప‌ట్లోనే 11 పార్ల‌మెంటు సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప్ర‌తి ప‌థ‌కం వెనుక ఎంతో మ‌థ‌నం ఉంది. గొర్రెల పెంప‌కం విష‌యంలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నాం“ అని ముఖ్య‌మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.