తిహాడ్ జైలులో క‌విత‌.. ఇంటి భోజ‌నానికి అనుమ‌తి

ఢిల్లీ (CLiC2NEWS): బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌వితకు తిహాడ్ జైలులో అవ‌స‌ర‌మైన వ‌స‌తులు క‌ల్పించాల‌ని రౌస్ అవెన్యూ కోర్టు జైలు అధికారుల‌ను ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం, ప‌రుపు, దుప్ప‌ట్లు తెచ్చుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. జ‌ప‌మాల‌, పుస్త‌కాలు, పెన్నులు, ఇత‌ర వ‌స్తువుల‌తో పాటు మెడిటేష‌న్ చేసుకొనేందుకు , అభ‌రణాలు ధ‌రించేందుకు , లేసులు లేని బూట్ల‌ను అనుతించాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. న్యాయ‌స్థానం అనుమ‌తించినా.. ఏ ఒక్క‌టి అనుమ‌తించ‌లేద‌ని క‌విత త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మ‌రోసారి జైలు అధికారుల‌ను న్యాయ‌స్థానం ఆదేశించింది. కోర్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమ‌తించిన‌ట్లు జైలు సూప‌రింటెండెంట్ న్యాయ‌స్థానానికి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.