kazipet: జారిపోయిన ప్రయాణికుడి చెప్పును తిరిగి అప్పగించారు..
ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన రైల్వే పోలీసులు

కాజీపేట (CLiC2NEWS): `చెప్పు`కోవాల్సిందే.. మీరు వింటున్నది నిజమే.. రైలెక్కుతుండగా జారిపోయిన చెప్పును ప్రయాణికుడికి అప్పగించారు రైల్వే పోలీసులు.. దీంతో నెట్టింట్లో రైల్వేశాఖ పనితీరును పలువురు అభినందిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. జనగామ జిల్లా చిల్పూరుకు మండలం పల్లగుట్టకు చెందిన రాజేష్ (25) అనే విద్యార్థి శనివారం సికింద్రాబాద్ వెళ్లడానికి ఘనపురం రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో కదులుతున్న రైలు ఎక్కతుండగా తన చెప్పు జారి రైలుపట్టాల మధ్యలో పడిపోయింది.
దీంతో ఆ విద్యార్థి రైల్వే అధికారులకు ట్వీట్ చేశాడు. `తన చెప్పులు కొత్తవి.. అవి అంటే నాకు చాలా ఇష్టం“ అంటూ రైల్వే అధికారులకు ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్‌కు స్పందిందిచిన సికింద్రాబాద్ డివిజన్ భద్రతాధికారి దేబాస్మిత.. కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసు అధికారులకు సమాచారం అందజేశారు. దాంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆ విద్యార్థి చెప్పును ఆదివారం కాజీపేటకు తీసుకువచ్చి విద్యార్థి రాజేశ్‌కు అందజేశారు.