TRS అధ్యక్ష పదవికి KCR తరఫున నామినేషన్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కెసిఆర్ తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి సిఎం కెసిఆర్‌ను మంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా, మంత్రులు బలపరిచారు.
కాగా టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.
- ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
- ఈనెల 23న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన.
- ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.
- ఈ నెల 25 హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక.
- ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరించునున్నారు.