లోక్‌సభ ఎన్నికల ఓటమితో బిఆర్ఎస్‌కు దిష్టిపోయింది: కెసిఆర్
గజ్వేల్ (CLiC2NEWS): కాంగ్రెస్‌పై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని మాజి సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ, జిల్లా నేతలు, కార్యకర్తలతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో బిఆర్ ఎస్ పార్టికి దిష్టి తీసినట్లైందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని, కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్ధమైందన్నారు. పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణ కూడగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.