ఎమ్మెల్యేగా ప్ర‌మాణస్వీకారం చేసిన కెసిఆర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): బిఆర్ ఎస్ అధినేత, మాజి ముఖ్య‌మంత్రి కెసిఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కెసిఆర్ గ‌జ్వేల్ నుండి గెలుపొందిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత రోజు ఆయ‌న ప్రమాదానికి గురై ఆస్ప‌త్రిలో శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌లేదు. గురువారం మ‌ధ్యాహ్నం శాస‌న స‌భాప‌తి కార్యాల‌యంలో గ‌డ్డం ప్ర‌సాద్ కెసిఆర్‌తో ప్ర‌మాణం చేయించారు. ఈ కార్యక్ర‌మంలో బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.