రేపు తమిళనాడు సిఎంతో కెసిఆర్ భేటీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. సిఎం కెసిఆర్ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రేండోసారి అని, రేపు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేవమవుతానని ప్రకటించారు.