ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ డిసెంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు రోజే కెసిఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన కోలుకుని ఇటీవల పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల 1వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కు లేఖ రాశారు.