ముఖ్యమంత్రిగా కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం: మంత్రి కెటిఆర్
![](https://clic2news.com/wp-content/uploads/2022/05/KTR.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో మళ్లీ అధికారంలోకి వచ్చే భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వమే అని మంత్రి కె. తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గా కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయమని మంత్రి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో భూ క్రమబద్ధీకరణ పత్రాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. పంద్రాగస్టు నుంచి అక్టోబరు నెలలో నియోజకవర్గానికి 4 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే గృహలక్ష్మి పథకం కింది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడు వేల కుటుంబాలకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.