సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం..

ఢిల్లీ (CLiC2NEWS): సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయకు కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారం వరించింది. 2021 ఏడాదికి గాను తెలుగు అనువాద రచనలో ఈ పురస్కారం లభించింది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్ హిందీలో రాసిన ‘అదృశ్య భారత్’ (నాన్‌ఫిక్షన్) పుస్తకాన్ని తెలుగులో ‘అశుద్ధ భారత్’ పేరుతో అనువదించారు. ఈ పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ. 50వేల నగదును అందజేస్తారు. దేశంలో 22 భాషల్లో అనువాద పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను సాహిత్య అకాడమి శుక్రవారం విడుదల చేశారు.