పాఠశాలల్లో ఇకపై ‘టీచర్’ అని పిలవాల్సిందే!
![](https://clic2news.com/wp-content/uploads/2021/09/school-Teacher.jpg)
తిరువనంతపురం (CLiC2NEWS): పాఠశాలల్లో ఉపాధ్యాయులను టీచర్ అని సంబోధించాలని కేరళ బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. కేరళ స్టేట్ కమిషన్ ప్యానల్ ఛైర్పర్సన్ కె వి మనోజ్, విజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం..ఉపాధ్యాయులను పిలువడానికి సార్, మేడమ్ అనే పదాలు వాడొద్దని, ఇద్దర్నీ టీచర్ అని మాత్రమే సంబోధించాలని పేర్కొంది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శాకాలు జారీ చేయాల్సిందిగా విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అనే పదం ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఇద్దరికీ వర్తిస్తుందని.. ఇలా పిలవడం వనల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య అనుబంధం మరింతాగా పెరుగుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. విద్యార్థి దశలోనే పిల్లలకు స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అన్న విషయం గ్రహించేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు బాలల హక్కుల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది.