రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు కుదింపు

ఢిల్లీ (CLiC2NEWS): రైల్వే ప్రయాణికులకు శుభవార్త. టికెట్ రిజర్వేషన్ కు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ 120 రోజులు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఇపుడు దానిని 60 రోజులకు కుదించారు. ఈ కొత్త విధానం నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు. కానీ తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌లో ఎటువంటి మార్పూ లేదు. విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకోవాలి. దీనిలో ఎటువంటి మార్పూ చేయలేదు.