ఎపి కేబినేట్ కీలక నిర్ణయాలు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి గోపాలకృష్ణ మీడియాకు వివరించారు. 45-60 ఏళ్లలోపు ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటి మహిళలకు ఆర్ధిక సాయం కోసం వైఎస్ ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ పథకానికి రూ. 4,700 కోట్లను కేటాయిస్తూ ఎపి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ విశాఖలో లక్ష ఇండ్ల నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిన 175 మంది ఖైదీలకు అదనంగా మరో 20 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రామసచివాలయ ఉద్యోగుల ర్యాటిఫికేషన్‌కు.. సచివాలయాలకు రూ. 20 లక్షల చొప్పున కేటాయింపునకు అమోదం తెలిపింది.