తెలంగాణ కేబినెట్ కీల‌క‌ నిర్ణ‌యాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): జూన్ 2వ తేదీన రాష్ట్ర అవ‌ర‌త‌ర‌ణ వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని, ఈ వేడుక‌ల‌కు ఎఐసిసి అగ్రనాయ‌కురాలు సోనియా గాంధీని ఆహ్వానించాల‌ని రాష్ట్ర కేబినేట్ నిర్ణ‌యించింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. స‌మావేశంలో తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, శ్రీ‌ధ‌ర్ బాబు మీడియాకు వివ‌రించారు.
రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన స‌న్న బియ్యం అంతా రాష్ట్రంలోనే సేక‌ర‌ణ‌
స‌న్న వ‌డ్ల‌కు క్వింటాల్‌కు అధ‌నంగా రూ. 500
అకాల వ‌ర్షాల‌తో త‌డిసిన ధాన్యాన్ని కూడా మ‌ద్ద‌తు ధ‌ర‌కే సేక‌ర‌ణ‌
ఎంఎస్‌పి కంటే ఒక్క రూపాయి కూడా త‌క్కువ చెల్లించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం
న‌కిలీ విత్త‌నాల విక్ర‌యదారుల‌పై క‌ఠిన చ‌ర్యలు
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఆధ‌నీక‌ర‌ణ‌కు రూ. 600 కోట్లు
అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల ప‌నుల‌పై మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌బ్‌క‌మిటి
మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల‌పై నిపుణుల క‌మిటి ఏం చెబితే అదిచేయాల‌ని నిర్ణ‌యం

Leave A Reply

Your email address will not be published.