ఉక్రెయిన్‌ నుండి భార‌తీయుల‌ను తీసుకురావ‌డానికి కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఉక్రెయిన్‌లో వేల సంఖ్య‌లో భార‌తీయులు స‌హాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని తీసుకురావ‌డానికి భార‌త్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల త‌ర‌లింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  భార‌తీయుల త‌ర‌లింపుపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హంగేరీ, రొమేనియా మార్గాల డుండా వారిని స్వ‌దేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఈ రెండు దేశాల స‌రిహ‌ద్దుల‌ను ద‌గ్గ‌ర‌గా ఉండేవారు చెక్‌పాయింట్ల వ‌ద్ద‌కు రావాల‌ని సూచించారు. స‌రిహ‌ద్దుకు స‌మీపంలో ఉండేవారికి ముందుగా అవ‌కావం ఇవ్వ‌నున్నారు. భార‌తీయులు ఎమ్ఈఎ తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని భార‌త ఎంబ‌సీ తెలిపంది. హంగ‌రీ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన చాప్‌-జ‌మ‌క్ష‌నీ ప్రాంతానికి, రొమేనియా స‌రిహ‌ద్దు ప్రాంతం పొరుబ్నే-సిరెట్ ప్రాంతానికి  స‌హాయ‌క బృందాలు చేరుకున్న‌ట్లు హంగ‌రీలోని భార‌త ఎంబ‌సీ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.