ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..

హైదరాబాద్ (CLiC2NEWS): ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ఇవాళ ఉదయమే ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేశారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.
టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. మహా గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.