ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా ఆవిష్కరణ

హైదరాబాద్ (CLiC2NEWS): ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా పంచముఖ రుద్ర మహాగణపతిగా (ఐదు తలలతో) దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఇవాళ ఆవిష్కరించింది.
మండపంలో గణనాథుడికి ఎడమ వైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు (15 అడుగులు) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ వెల్లడించింది. గణేశ్ ఉత్సవ విగ్రహ నమూనాను ఖైరతాబాద్‌లోని వినాయక మండపం వద్ద కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సంవత్సరం 40 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత ఏడాది కొవిడ్ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.