ఇటీవల అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి
ఖమ్మం (CLiC2NEWS): అమెరికాలో కత్తపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్ రాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మంలోని మామిళ్లడూడెంకు చెందిన వరుణ్ ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. గత నెల 31వ తేదీన వరుణ్ జిమ్‌నుండి తిరిగి రూమ్‌కు వెళ్లే సమయంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ.. యువకుడు మృతి చెందినట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తెలుసుకున్న కుంటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరుణ్ తండ్ర మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.