బిజెపి జమ్ముకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కిషన్‌రెడ్డి

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో త్వరలో పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి ఇన్‌ఛార్జులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టి తరపున ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని పలువురు కేంద్రమంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించింది. దీనిలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ కు బిజెపి ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. జమ్ముకశ్మీర్ లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్డు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.