సల్మాన్‌ఖాన్, వెంకటేశ్, రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో..

ముంబయి (CLiC2NEWS): సల్మాన్‌ఖాన్, పూజా హెగ్దే నటిస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ చిత్రం లోని ఏంటమ్మ.. ఏంటమ్మ అంటూ సాగే పాటను చిత్రం బృందం విడుదల చేసింది. ఈ పాటలో సల్మాన్ ఖాన్‌తో పాటు వెంకటేశ్, రామ్‌చరణ్ స్టెప్పులు వేశారు. ముగ్గురు కలిసి చేసిన లుంగీ డ్యాన్స్ అదిరింది మామూలుగా ఒక్కరు డ్యాన్స్‌చేస్తేనే ఫ్యాన్స్‌కు పండగ.. మరి ఇక ముగ్గురు కలిసి స్టెప్పులేస్తే.. పూనకాలే. ఇటీవల ఈ చిత్రం నుండి బతుకమ్మ పాట విడుదలైన సంగతి తెలిసిందే.