రాజ్యసభ సభ్యత్వానికి కెకె రాజీనామా
హైదరాబాద్ (CLiC2NEWS): రాజ్యసభ సభ్యత్వానికి కె. కేశవరావు (కెకె) రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. బిఆర్ ఎస్ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన కెకె ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.