త్వరలో జిల్లా ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలోనూ మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న రోగులను హరీశ్‌రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడి చికిత్సలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుత్తోనే ఇటువంటి చికిత్సలు జరుగుతున్నట్లు తెలిపారు. సిద్దపేటలో ప్రతి వారం ఇద్దరికి మోకీలు మార్పిడి ఆపరేషన్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రలపై రోగులకు నమ్మకం పెరిగిందని, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి హరీశ్‌రావు సూచించారు.