రేపు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..
ఒకేసారి 52 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు

ఒంటిమిట్ట (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణ వేదికను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్‌రె్డ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్సి అన్బురాజన్ పరిశీలించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుండి గంటల వరకు సీతారాముల కల్యాణం జరగనుంది. శాశ్వత కల్యాణ వేదికలో మొదటిసారిగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఒకేసారి 52 వేల మంది భక్తులు కూర్చొని కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.