టి 20 లకు గుడ్‌బై చెప్పిన భారత స్టార్ బ్యాటర్..

Kohli: టీమ్ ఇండియా సంబరాలు చేసుకుంటుంది. టి 20 ప్రపంచకప్ ఫైనల్ భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ టోర్నీ ఫైనల్‌లో 76 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం విరాట్ టి20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఇది నా చివరి టి20 ప్రపంచకప్. మేం సాధించాలనుకున్నది ఇదే. భారత్ తరపున ఇదే నా చివరి టి20. ఈ కప్ గెలవాలనుకున్నానని.. ఇది అందరికి తెలిసిన విషయమే. ఒక వేళ వరల్డ్‌కప్ సాధించలేకపోయిన రిటైర్మెంట్ ప్రకటించేవాడినన్నారు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపాడు. విరాట్ తన కెరీర్‌లో మొత్తం 125 టి 20లు ఆడగా.. 4188 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన జట్టులో విరాట్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ టి20 ప్రపంచకప్ సాధించిన అతికొద్ద మంది భారత క్రికెటర్లలో విరాట్ ఒకరు.