స‌చిన్ రికార్డు బ్రేక్‌ చేసిన కోహ్లీ.. స‌చిన్ స్పంద‌న‌

ముంబ‌యి (CLiC2NEWS): వ‌న్డే క్రికెట్ చరిత్ర‌లో స‌చిన్ అత్య‌ధిక (49) సెంచ‌రీల రికార్డును విరాట్ కోహ్లీ అధిగ‌మించాడు. బుధ‌వారం జ‌రిగిన న్యూజిలాండ్-భార‌త్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లీ (117)సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. ఇది కోహ్లీ 50వ శ‌త‌కం. కోహ్లీ వ‌న్డే చరిత్ర‌లో 50 సెంచ‌రీలు చేసిన బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో స‌చిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. దీనికి క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

విరాట్ త‌న‌ను మొద‌టిసారిగా క‌లిసిన విష‌యాన్ని గుర్తుచేశారు. ‘తొలిసారి నిన్ను ఇండియ‌న్ డ్రెస్సింగ్ రూమ్‌లో క‌లిశాన‌ని.. త‌న పాదాలు తాకుతుంటే కోహ్లీ ప్రెండ్స్ ప్రాంక్ చేశార‌ని,, అపుడు త‌ను కూడా న‌వ్వు ఆపోలేక‌పోయిన‌ట్లు తెలిపారు. కానీ నీ అంకిత భావం, క్రీడా నైపుణ్యంతో నాహృద‌యాన్ని ట‌చ్‌చేశావ్‌.. అ యువ‌కుడు విరాట్ ప్లేయ‌ర్‌గా ఎదిగినందుకు త‌న‌కు చాలా సంతోషంగా ఉంద‌ని’ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.