శ‌తకం బాది.. స‌చిన్ రికార్డును అధిగ‌మించిన కోహ్లీ

గువాహ‌టి (CLiC2NEWS): క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ. శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ భారీ స్కోర్ సాధించింది. భార‌త్‌, శ్రీ‌లంక మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డేలో భార‌త్ 7 వికెట్ల న‌ష్టానికి 373 ప‌రుగులు సాధించింది ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ(113) చేసి.. ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.
సొంత దేశంలో 20 సెంచ‌రీలుసాధించి.. స‌చిన్ రికార్డును స‌మం చేశాడు. స‌చిన్ 164 వ‌న్డేల్లో 20 సెంచ‌రీలు సాధించ‌గా.. కోహ్లీ 102 వ‌న్డేల్లో 20 సెంచెరీలు చేశాడు. అంతేకాకుండా శ్రీ‌లంకపై అత్య‌ధిక సెంచ‌రీ సాధించిన బ్యాట‌ర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఇంత‌కు ముందు స‌చిన్ 8 సెంచ‌రీలు చేయ‌గా.. కోహ్లీ 9వ సెంచ‌రీ బాదాడు. ఇంకా విరాట్ అన్ని ఫార్మాట్లో క‌లిపి 73 శ‌త‌కాలు సాధించాడు. దీంతో స‌చిన్ 100 త‌ర్వాత కోహ్లీ రెండ‌వ స్థానంలో ఉన్నాడు.

Leave A Reply

Your email address will not be published.