ప్రముఖ కోలీవుడ్ నటడు విజయకాంత్ కన్నుమూత.

చెన్నై (CLiC2NEWS): ప్రముఖ కోలీవుడ్ నటడు విజయకాంత్ ఆనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యలతో ఆయన ఇటీవల చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేరారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడియారు. ఆయన మరణవార్త విని సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. 27 ఏళ్ల వయస్సులో విజయకాంత్ సినీ జీవితంలోకి అడుగుపెట్టారు. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో నటించారు. 150కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన కెప్టెన్ ప్రభాకర్ చిత్రం నుండి అభిమానులు కెప్టెన్‌గా పిలుచుకుంటున్నారు.