RRR: ‘కొమురం భీముడో’.. ఫుల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఒక్కొక్క ఫుల్ వీడియో సాంగ్ రిలీజ‌వుతుంది. తాజాగా చిత్ర బృందం ‘కొమురం భీముడో’.. పూర్తి వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రం నుండి ఏ పాట విడుద‌లైనా.. కొమురం భీముడో ఎప్పుడు? అంటూ.. వ‌స్తున్న సినీ అభిమానులు, నెటిజ‌న్లు వ‌రుస కామెంట్లు చేసేవారు. వీటిపై స్పందించిన చిత్ర బృందం.. రావాల్సిన టైమ్‌కు వ‌స్తుంది అంటూ.. తాజాగా ఆ కానుకును అందించింది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించ‌గా కాల‌భైర‌వ గాత్రమందించారు. కీర‌వాణి సంగీతంతో ఈ పాట శ్రోత‌ల హృద‌యాలను హ‌త్తుకునేలా ఉంది.


Leave A Reply

Your email address will not be published.