కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..

అన్నప్రాసన నాడే అందుకున్నావు !

నిక్షిప్త పుస్తకాల బండాగారాన్ని…

ఆధునిక విద్య అంచుపైన నీవుండాలి

చదువుల తల్లి నిన్ను చంకనెత్తుకు తిరగాలి

విజ్ఞాన ఖనివై ఏ వెలుగులు ప్రసరిస్తావో

అంబాడుతున్న ఈ వయసు లోనే

నా మదిలో నీపై ఊహలు ఎన్నెన్నో

ఆశల పల్లికిలో నే ఊరేగుతున్నా

అగ్రరాజ్య పౌరసత్వం నీది

అకాశమే హద్దుగా నీకు అవకాశాలు అక్కడ

ఏ పరిశోధనలతో పరిణితి చెందుతావో

అంతరిక్షం నెలవుగా ఎంతగా విహరిస్తావో

నాసా కేంద్రంగా ఎదుగుతావో ఎంతెత్తుకో…

ప్రగతి చక్రాలను ఏ స్థాయి పరిగెత్తిస్తావో

నీ వృద్ధి, నీ ప్రగతి, నీ విజ్ఞానం, నీ పయనం,

అంతా అగ్రరాజ్యం కోసమే కదా?

నింగిని తాకుతున్న దేశం నీది

మేథో వలసలతో బక్కచిక్కుతున్నది నాదేశం

ఆపన్న హస్తం అందిస్తావా…నా భరత భూమికి.

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు

త‌ప్ప‌కచ‌ద‌వండి: కోనేటి రంగయ్య: మనసు ఆరాటం

Leave A Reply

Your email address will not be published.