బాలిక‌కు అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసిన కోఠి ఇఎన్‌టి వైద్యులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని కోఠి ఇఎన్‌టి వైద్యులు అరుదైన శ‌స్త్ర‌చికిత్సను నిర్వ‌హించి చిన్నారికి పున‌ర్జ‌న్మ‌నందించారు. వివ‌రాల‌లోకి వెళితే..న‌ల్గొండ జిల్లాల‌, నిడ‌మ‌నూరు మండ‌లం ముప్పారం గ్రామానికి చెందిన ర‌వి, నాగ‌మ‌ణి దంప‌తుల కుమార్తె గ‌త కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవ‌డం స‌మస్య‌గా మారింది. శ్వాసంసంభంద‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కుంటుంది. దీంతో త‌ల్లిదండ్రులు ఆమెనుకొఠిలోని ఇఎన్టి ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. ఆమెకు ఉన్న స‌మ‌స్య‌కు కార్పొరేట్ ఆస్ప‌త్రిలో రూ. 5ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. త‌ల్లిదండ్ర‌లు పేద‌వారు కావ‌డంతో కోఠి ఆస్ప‌త్రి వైద్యుల‌ను ఆశ్ర‌యించారు. వైద్యులు ఆ చిన్నారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. చిన్నారి శ్వాస‌నాళంలోని కెరినాకు కొంత పైభాగంలో పాపిలోమా (పులిపిరి వంటిది) ఉన్న‌ట్లు గుర్తించారు. అది ట్రాఖియా ఎగువ భాగం వ‌ర‌కు వ్యాపించ‌డంతో శ్వాస‌నాళం మూసుకుపోయిన‌ట్లు తెలిసింది. శ‌నివారం ఆ బాలిక‌కు శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఆ బాలిక ఆరోగ్య‌ ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని.. అందిరిలాగానే శ్వాస తీసుకోగ‌లుగుతుంద‌ని వైద్యులు తెలిపారు.

సాధారణంగా పాపిలోమాలు స్వ‌ర‌పేటిక‌లో వ‌స్తుంటాయ‌ని, ఆ చిన్నారికి శ్వాస‌నాళంలో కెరినా పైభాగంలో ఏర్ప‌డింద‌న్నారు. ఇలా అరుదుగా జ‌రుగుతుంటాయ‌ని, ఇది ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని తెలిపారు. శ‌స్త్ర చికిత్స‌ను నిర్వ‌హించిన వైద్యుల‌ను కోఠి ఇఎన్‌టి ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ అభినందించారు.

 

Leave A Reply

Your email address will not be published.