ఢిల్లీలో ఒక్కరోజే 50% పెరిగిన కొవిడ్ కేసులు

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా మళ్లీ వెయ్యికి దగ్గర్లోనే కోత్త కేసులు నమోదయ్యాయి. కాగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు నమోదయ్యాయి. ముందురోజు అక్కడ 202 మందికి కరోనా సోకగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 299కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 % నుంచి 2.70 % కి పెరిగింది. మరోపక్క దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. గురువారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
దేశంలో నిన్న ఒక్కరోజులో 4.34 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,007 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే ఏడు శాతం అధికంగా కేసులు వచ్చాయి. నిన్న దేశవ్యాప్తంగా ఒకే ఒక్క మరణం నమోదైంది. ఆ ఒక్కటి కూడా మహారాష్ట్రలో నమోదయింది. నిన్న ఒక్కరోజులో 818 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.76% కొనసాగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య 11,058(0.03 శాతం)గా ఉంది. నిన్న 14.48 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇంప్పటివరకూ 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.