వైద్య కళాశాలలో 281 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్..

బెంగళూరు(CLiC2NEWS) : కర్ణాటక రాష్ట్రం, ధార్వాడలోని ఎస్‌డిఎం మెడికల్ కళాశాలలో 281 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రోజు కొత్తగా మరో 77 మందికి వైరస్ సోకగా పాజిటివ్ కేసుల సంఖ్య 281కి చేరింది. ఈ కాలేజ్ క్యాంపస్‌లో కొన్ని రోజుల క్రితం ఫ్రెషర్స్ డే పార్టీ వేడుకలు జరగాయి. కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. కళాశాలలోని దాదాపు 300 మందిని పరీక్షించగా.. 66 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కళాశాల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. కరోనా నెగెటివ్ వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. కొవిడ్ సోకిన వారంతా రెండు డోసుల
వ్యాక్సిన్ వేయించుకున్నవారే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.