150 మంది సుప్రీంకోర్టు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్..!

ఢిల్లి (CLiC2NEWS): భారత అత్యున్నత న్యాయస్థానంలోని సుమారు 150మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆస్పత్రులలోని వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిబ్బందికి ఈవైరస్ బారినపడినట్లు వెల్లడించారు. ఉన్నత న్యాయస్థానంలో 3వేల మంది సిబ్బంది ఉండగా వారిలో 150 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణయినట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కవవుతున్న తరుణంలో న్యాయస్థానం ప్రాంగణంలో కరోనా టెస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో లక్షణాలున్న వార తప్పకుండా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేశారు.