కర్ణాటక సిఎంకు కొవిడ్ పాజిటివ్..
బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకొని హోంఐసోలేషన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు
కర్ణాటకలో ఈ ఒక్కరోజే 11,698 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వలన నలుగురు మృతిచెందారు. కాగా.. 1148మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 60,148 ఉన్నాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కొవిడ్ పాజిటివ్..